సెప్టెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా...?

నల్లగొండ జిల్లా:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక( Telangana Assembly election )లు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

అందులో భాగంగానే సీఈసీ సభ్యులు బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) కు రానున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే నగారా మోగే సూచనలు కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి నేతృత్వంలో అధికారుల టీం హైదరాబాద్ లో నాలుగు రోజులు మకాం వేయనుంది.ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో వీరు భేటీ కానున్నారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు.

Advertisement
Pimples Blemishes : ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మొటిమలే కాదు వాటి తాలూకు మచ్చలు సైతం పరార్!

Latest Nalgonda News