ప్రచారానికి పదును పెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు  

ఈ నెల 16 నుంచి తిరుపతి వేదికగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం .

  • ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకి కరెక్ట్ గా నెల రోజుల సమయం మాత్రమె వుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు తన రాజకీయ వ్యూహాలని పదును పెడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకి వెళ్తున్నాయి. అందులో భాగంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే చాలా వరకు అభ్యర్ధులని మొదటి జాబితాలోనే ప్రకటించాయి. ఇక రెండో జాబితాలో మిగిలినవి కూడా కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం వుంది.

  • ఇదిలా వుంటే అధికార పార్టీ టీడీపీ ఎన్నికల శంఖారావం ను అధినేత చంద్రబాబు తిరుపతి నుంచి ప్రారంభించబోతున్నాడు. ఈ నెల 16న తిరుపతిలో శ్రీవారి దర్శనం అనంతరం బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన శంఖారావంని చంద్రబాబు మొదలుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం అధికార పార్టీపై కొంత వ్యతిరేకత వున్న నేపధ్యంలో బాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలని ఎంత వరకు ఆకర్షిస్తాడు అనేది ఆసక్తిగా మారింది.