లాక్ డౌన్ కారణంగా చెఫ్ గా మారిపోయా అంటున్న తమన్నా

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయినా అందాల భామలు కెరియర్ లో పడి ఇప్పటి వరకు చేయని చాలా విషయాలు చేస్తున్నారు.అలాగే తమ చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటున్నారు.

 Tamannah Become A Chief With Corona Situation, Tollywood, Kollywood, South Cinem-TeluguStop.com

ఇంట్లో ఫామిలీతో గడిపే సమయం రావడంతో హీరోయిన్స్ ఎక్కువగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.అలాగే ఇంట్లో వారి చేతికి పని చెబుతూ వంటింట్లో దూరిపోయి అమ్మ దగ్గర ఉంచి అన్ని వంటలు నేర్చేసుకుంటున్నారు.

అందరి భామల మాదిరిగానే తమన్నా కూడా తనకి దొరికిన ఖాళీ సమయాన్ని పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందడానికి ఉపయోగించుకుంది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

ఇప్పటి వరకు మోడలింగ్, సినిమాలు అంటూ ఇంటి దగ్గర స్పెండ్ చేసే సమయమే దొరకలేదు.అలాగే ఎప్పుడు కూడా ఎవరైనా వండిపెడితే తినడం తప్ప ఒంట చేసి ప్రయత్నం నేర్చుకోలేదట.

అయితే ప్రస్తుతం సమయం దొరకడంతో వంట నేర్చుకున్నట్లు ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

ఇంతకుముందు మా ఇంట్లో నేనెప్పుడూ కిచెన్ లోకి అడుగుపెట్టలేదు.

అసలు ఏ వస్తువు ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు.దాంతో మొదట్లో కాస్త తికమకపడ్డాను.

అయితే, తర్వాత అంతా అదే అలవాటైపోయింది.రోజూ ఏదో ఒక ఫుడ్ ఐటెం వండేదాన్ని.

దాంతో వంట చేయడం వచ్చేసింది.ఇప్పుడు కుక్ గా నేను పర్వాలేదు.

సూపర్ కాకపోయినా బాగానే చేస్తాను.ఈ లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు నాలోని కుక్ బయటకు వచ్చింది అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

మొత్తానికి ఈ లాక్ డౌన్ కారణంగా అందాల భామలు ఎప్పుడూ గ్లామర్ షో మాత్రమే కాకుండా గరిటె తిప్పడం కూడా భాగా ప్రాక్టీస్ చేశారని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube