నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు రోజురోజుకు మరింతగా ముదిరిపోతుంది.ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య రగడ తీవ్ర రూపాన్ని దాల్చుతుంది.
జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య మాటల రగడ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో అనేక కార్యక్రమాల్లో, సభల్లో పరస్పర విమర్శలు చేసుకున్నారు.
తాజాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో బీరంపై జూపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.కొత్త జిల్లాలు వచ్చిన లాభం లేకుండా పోయిందన్న జూపల్లి ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
అంతేకాకుండా బీరం హర్షవర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశారు.నియోజకవర్గంలో 36 పనులకు సంబంధించిన జీవో నంబర్లతో కరపత్రాలను ప్రచురించారు.
ప్రతి ఇంటికి కరపత్రాలను పంపిణీ చేయాలని కార్యకర్తలకు జూపల్లి సూచించారని సమాచారం.