ట్రాఫిక్ పోలీసుల వింత నిబంధన.. ఆ సర్టిఫికెట్ ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారట.. ?

మనిషికి క్యారెక్టర్ ముఖ్యం అంటారు దీని విలువ తెలిసిన వారు.క్యారెక్టర్ లేని వారు కూడా ఈ క్యారెక్టర్ మీద గంటకు గంట క్లాసులు పీకుతారు.

 Mp Police Asking Character Certificate For Driving License, Madhya Pradesh, Stra-TeluguStop.com

అందుకే చెప్పుకోవడానికి తప్పా ఫ్రూఫ్ చేసుకోవడానికి పనికిరాని దానిలా మిగిలిపోయింది ఈ క్యారెక్టర్.

ఇక క్యారెక్టర్ అంటే నటన కాదండి వ్యక్తిత్వం.

ఇప్పుడు ఈ వ్యక్తిత్వాన్ని బట్టే విలువ ఇస్తున్నారట పోలీసులు.ఎక్కడ, ఎందుకో తెలుసుకుంటే.

సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలి.లైసెన్స్ పొందడానికి తగిన అర్హతలు కావాలి.

దీంతో పాటుగా అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, తప్పని సరిగా కావాలి.అన్నిచోట్ల ఉన్న రూల్ ఇది.

Telugu License, Madhya Pradesh, Strange Rule-Latest News - Telugu

కానీ మధ్యప్రదేశ్‌లో అధికారులు మాత్రం వింత నిబంధన పెట్టారు.ఎవరికైన డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే క్యారెక్టర్ సర్టిఫికెట్ తీసుకురావాలని కండిషన్ విధించారు.ఈ యువకుడు లేదా యువతి మంచివారు.వారి మీద ఎలాంటి కేసులు లేవు.వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వొచ్చు.అని సర్టిఫికెట్ కావాలట.

అంతే కాదండోయి ఈ సర్టిఫికెట్ కూడా పోలీసుల నుంచి తీసుకు రావాలట.ఇకపోతే అక్కడ మహిళలపై జరిగే నేరాలను అదుపు చేయడానికే ఈ వింత రూల్ పెట్టారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube