విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సోము వీర్రాజు కీలక కామెంట్లు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోంది.మొన్నటి వరకు విగ్రహాల ధ్వంసం ఘటన తర్వాత పంచాయతీ ఎన్నికలతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా ఉన్నాయి.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో బిజెపి పార్టీ రాణించాలని అనేక రీతులుగా ప్రభుత్వంపై.అనేక విషయాలలో పోరాడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి తరుణంలో కొద్దో గొప్పో బిజెపి ఏపీలో మెరుగుపడుతుంది అనుకున్న కీలక సమయంలో.ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకోవటం ఏపీ బిజెపి కి పొలిటికల్గా ఎదురుదెబ్బ అనే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో విశాఖలో కార్మిక సంఘాలన్నీ రోడ్డెక్కి భారీ స్థాయిలో బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు.ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గక పోతే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు.

Advertisement

ఇలాంటి తరుణంలో ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు.ఈ విషయంలో మరోసారి కేంద్రంతో మంతనాలు జరుపుతమని స్పష్టం చేశారు.

ఆంధ్రుల హక్కు అనేది గొప్ప ఉద్యమం అని అన్నారు.ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో ఎమ్మెల్సీ మాధవ్ కలవటం జరిగిందని.

, జీవీఎల్ నరసింహారావు కూడా మాట్లాడుతున్నారని, మరోసారి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర మంత్రులను కలుస్తామని స్పష్టం చేశారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు