బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

 Storm In Bay Of Bengal. Rain Forecast For Ap-TeluguStop.com

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అధికారులు తెలిపారు.శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్య దిశగా 420 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడులోని నాగపట్నం దక్షిణ ఆగ్నేయానికి 600 కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా చెన్నైకి 690 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు.

వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube