బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అధికారులు తెలిపారు.శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్య దిశగా 420 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడులోని నాగపట్నం దక్షిణ ఆగ్నేయానికి 600 కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా చెన్నైకి 690 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు.

వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.

చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నవీన్ పోలిశెట్టి ఎందుకు సినిమాలను లేట్ చేస్తున్నాడు…