ఇండియన్‌-అమెరికన్ కమ్యూనిటీని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా: స్టాంఫోర్డ్ మేయర్!

విద్య, వ్యాపారం, కళలు, సంస్కృతి వంటి వివిధ రంగాలలో అపారమైన సేవలందించినందుకు యూఎస్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులను స్టాంఫోర్డ్ మేయర్ కరోలిన్ సిమన్స్( Caroline Simmons ) ప్రశంసించారు.భారత ప్రవాసులు( Indian Americans ) చేసిన సేవలకు గానూ ఆమె గర్విస్తున్నట్లు తెలిపారు.

 Stamford Mayor Caroline Simmons Praises Indian American Communitys Contributions-TeluguStop.com

మేయర్ 2022లో స్టాంఫోర్డ్‌లో భారతదేశ స్వాతంత్ర్యానికి గుర్తుగా ఆగస్టు 15వ తేదీని ‘భారత దినోత్సవం’గా ప్రకటించారు.

కనెక్టికట్‌లోని గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(GOPIO)కి కొత్తగా ఎన్నికైన ఆఫీస్ సిబ్బందితో సిమన్స్ ప్రమాణం చేయించారు.సంస్థతో కలిసి పనిచేయడానికి, మరింత సమగ్రమైన, సమానమైన సమాజాన్ని నిర్మించడానికి దాని కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు.GOPIO-CT అనేది భారతీయ ప్రవాసులకు సేవలందిస్తున్న ఒక సంస్థ.

ఈ సంస్థ టర్కీ భూకంపం బాధితుల కోసం 5,000 డాలర్లు సేకరించింది.ప్రభావిత ప్రాంతానికి ఆహారం, టెంట్, బట్టలు, బేబీ ఫార్ములా, ఆర్థోపెడిక్ సామాగ్రిని పంపింది.

భారతీయ ప్రవాసులు రాజకీయ, కార్పొరేట్ ప్రపంచంలో విశేషమైన విజయాలు సాధించారు.భారతీయ సంతతికి చెందిన చాలా మంది పెద్ద కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారని GOPIO వ్యవస్థాపకుడు థామస్ అబ్రహం అన్నారు.కనెక్టికట్‌లో రాకీ హిల్, గ్లాస్టన్‌బరీ, న్యూవింగ్‌టన్, ఫెయిర్‌ఫీల్డ్, న్యూ హెవెన్, న్యూ లండన్ కౌంటీలతో సహా వివిధ శివారు ప్రాంతాలలో 24,000 మంది భారతీయ నివాసితులు ఉన్నట్లు అంచనా.నగరానికి చైతన్యం తీసుకురావడంలో భారతీయ ప్రవాసులు కూడా కీలక పాత్ర పోషించారని మేయర్ సిమన్స్ తెలిపారు.

ఆ విధంగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube