కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.అలా శ్రీలంక దేశం పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి వచ్చింది.
శ్రీలంక దేశం ఇలా దివాళా తీసేందుకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు కూడా కారణం అంటూ చాలా మంది ఆరోపిస్తున్నారు.వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆ దేశంలో ఐదు లక్షల మంది పేదరికంలో కూరుకుపోయారు.
రైతులను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించడం కూడా శ్రీలంకకు ఈ పరిస్థితి దాపురించడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.ప్రస్తుతం కరోనా కంగారు అన్ని దేశాల్లో ఉందని కానీ కేవలం శ్రీలంకలో మాత్రమే ఇలా ఎందుకు జరిగిందని కూడా కొంత మంది అంటున్నారు.
దానికి సమాధానం ఇదే…
శ్రీలంకలో టూరిజం మీద ఆధారపడి జీవించే వారే చాలా ఎక్కువ.ఆ దేశ ఎకానమీకి కూడా టూరిజం డిపార్ట్ మెంట్ చాలా అవసరం.
కానీ కరోనా పుణ్యమానికి గత కొద్ది రోజులుగా టూరిజం రంగం కుదేలయిపోయింది.తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియకుండా అయిపోయింది.
దీంతో శ్రీలంక ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది.ఈ దెబ్బకు అందరి ఉద్యోగాలు ఊడిపోయి వారంతా రోడ్డున పడ్డారు.
అదే సమయంలో వ్యవసాయ రంగం కూడా దేశంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది.ఈ కారణం కూడా దేశం ఇలా దివాళా తీసేందుకు కారణమయింది.
కరోనా సమయంలో అధిక వడ్డీలకు వివిధ దేశాల నుంచి తెచ్చిన అప్పులు తడిసి మోపెడయ్యాయి.విదేశీ నిల్వలు కూడా అడు గంటుకు పోయాయి.ద్రవ్యోల్బణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది.దీని ప్రభావం వలన నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి.ఈ ధరలను తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.ప్రస్తుతం చేసేందుకు ఎటువంటి పని లేకపోవడంతో అనేక మంది ఆ దేశం విడిచిపెట్టి వెళ్లాలని చూస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.