Sreeleela : అనాథ పిల్లలతో రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్న శ్రీలీల.. ఈమె రియల్ హీరోయిన్ అంటూ?

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో శ్రీ లీల పేరు కూడా ఒకటి.

 Sreeleela Celebrate Rakhi Festival With Cheers Foundation Orphans Photos Goes V-TeluguStop.com

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే.టాలీవుడ్ లో యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలలో నటించే అవకాశాలను సొంతం చేసుకుంది.

చేతిలో పది సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాణిస్తోంది.వరుసగా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క చదువుకుంటూ, మరో పక్క యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.ఇంత బిజీలో కూడా టైం కుదుర్చుకుని కొన్ని మంచి పనులు కూడా చేస్తోంది.కాగా శ్రీలీల ఎప్పటి నుంచో చీర్స్ ఫౌండేషన్ అనే ఒక అనాథాశ్రమానికి సపోర్ట్ గా నిలుస్తోంది.గతంలో కూడా ఈ అనాథాశ్రమంకు( Orphanage ) వెళ్లి అక్కడి పిల్లలతో గడిపిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.

ఇంత చిన్న వయసులోనే సక్సెస్ తెచ్చుకొని ఇంకొంతమందికి సహాయపడుతుందని అంతా శ్రీలీలని అభినందించారు.ఈ చీర్స్ ఫౌండేషన్ కి ఎప్పుడు ఏం కావాలన్నా శ్రీలీల అందిస్తుంది.

తాజాగా కూడా రాఖీ పండగ జరగడంతో శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంది.అక్కడి పిల్లలకు రాఖీ కట్టి, వారికి స్వీట్స్ తినిపించి వారితో రాఖి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.అక్కడి పిల్లలు శ్రీలీలకు స్పెషల్ బహుమతులు గిఫ్ట్ గా ఇచ్చారు.వారితో గడిపిన ఆ క్షణాలని ఫొటోలుగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి రక్షాబంధన్ చీర్స్ ఫ్యామిలీతో జరుపుకున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ కావడంతో శ్రీలీల నెటిజన్స్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube