ఒకప్పుడు కోన వెంకట్ అంటే కామెడికి పెట్టింది పేరు.డీ, రెడి,దూకుడు చిత్రాల్లో కోన రాసిన ప్రాస డైలాగులకి జనాలు ఈలలు కొట్టారు.
పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.మొదటిసారి కొనపై విమర్శలు బాద్షా సమయంలో వచ్చాయి.
ఆ సినిమా ఆడటంతో పెద్ద పట్టించుకోలేదు.గీతాంజలి, లౌక్యం చిత్రాలు హిట్ అవడంతో కోన పైత్యం పీక్స్ కి వెళ్ళిపోయింది.
గత సంవత్సరం మెచ్చుకున్నావారే ఇప్పుడు చేడామేడా తిట్టేస్తున్నారు.
పండగ చేస్కో అంతంతమాత్రమె ఆడింది.
బ్రూస్ లీ, అఖిల్ దారుణ పరాజయాలు.త్రిపుర తెలియకుండానే వచ్చి తెలియకుండానే పోయింది.
శంకరాభరణం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.మంచి ఫామ్ లో నిఖిల్ కుడా ఫ్లాప్ ఇచ్చేసాడు కోనా.
అప్పటికైనా మారల.ఈ రోజు విడుదలైన సౌఖ్యం చిత్రాన్ని బండబూతులు తిట్టుకుంటున్నారు బయట.ఇలాంటి చిత్రాలతో ఇండస్ట్రీకి పైసా లాభం లేదు అని బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్రేక్షకులు.
ఇక కోన ఎకౌంట్ లో ఉన్న మరో సినిమా డిక్టేటర్.
ట్రైలర్ చుస్తే ఇది కుడా మూస పద్ధతిలో సాగే పులిహోర సినిమా అని అర్థం అవుతోంది.ఏమిటో ఇది , ఎప్పుడు మారుతారో మన కోన వెంకట్ గారు, ఇట్లాగే కొనసాగితే కోన దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.