ఎన్టీఆర్ అభిమానులంతా ఊపిరి పీల్చుకోవచ్చు.సినిమా వస్తుందా రాదా, సినిమా పూర్తయ్యిందా లేదా అనే సంకోచంలో పడిపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ఒకవైపు సినిమా ఇంకా రెడి కాలేదు అని వార్తలు, మరోవైపు కొన్ని రాజకీయ శక్తులు కావాలని అడ్డుకుంటున్నాయని గాసిపులు.ఈ విషయంపై రేపు ప్రెస్ నోట్ వస్తుందని అన్నారు.
ఇంకా ఆలస్యం చేస్తే ఇంకెన్ని రూమర్స్ పుట్టుకొస్తాయో అనుకున్నారేమో.ఇందాకే ప్రెస్ నోట్ వదిలేసారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ” ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 27న విడుదల చేస్తున్నాం.దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రం కోసం అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు.
అలాగే ఆల్రేడి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ కి పంపించాం.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది.
వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాం.ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత కాస్టిలియేస్ట్ చిత్రంగా “నాన్నకు ప్రేమతో” చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా లావిష్ గా చిత్రీకరిస్తున్నాం.
దర్శకుడు సుకుమార్ టెక్నికల్ గా చాల హై స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు” అంటూ కన్ఫ్యూజన్ క్లియర్ చేసారు.
అటు తిరిగి , ఇటు తిరిగి , నందమూరి అభిమానుల మధ్య పోరుకు ఈ సంక్రాంతి వేదిక అవనుంది.
మరి బాబాయ్ గెలుస్తాడో, అబ్బాయే నిలుస్తాడో చూడాలి.