ఇంద్ర, బాహుబలి2 సినిమాలు బాషా నుంచి పుట్టినవే.. ఎస్జే సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ స్టార్ హీరో నాని( Nani ) హీరోగా నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం( Saripoda sanivaram ).ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

 Sj Surya Speech At Saripodhaa Sanivaaram Pre Release Event, Sj Surya, Saripodhaa-TeluguStop.com

త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ నివేగవంతం చేశారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే నటుడు ఎస్ జె సూర్య మాట్లాడుతూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా ఎస్జే సూర్య ( SJ Surya )మీడియాతో మాట్లాడే మాటలు, స్టేజ్ మీద ఇచ్చే స్పీచులు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే.సరిపోదా శనివారం గురించి మాట్లాడిన ప్రతీ సారి ఒకే మాటను వినిపిస్తున్నాడు.

Telugu Pre, Sjsurya, Sj Surya, Tollywood-Movie

సరిపోదా శనివారం చాలా కొత్తగా ఉంటుందని, శనివారం మాత్రం బాషా అని, మిగతా అన్ని రోజులు మాణిక్యం అని, ఆ మూవీ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేశాడు.శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించే హీరో పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని చెప్పుకొచ్చాడు.అలా సినిమా మెయిన్ థీమ్‌ ను విడుదల కాకముందే చెప్పేసి మూవీ మేకర్స్ కి షాక్ ఇచ్చాడు.ఇక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఎస్ జే సూర్య మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

యాక్షన్ జానర్‌ లో ఏ సినిమా తీసినా అది మాణిక్ బాషా నుంచి తీసుకున్నదే అంటూ చెప్పుకొచ్చాడు.

Telugu Pre, Sjsurya, Sj Surya, Tollywood-Movie

బాలయ్య చిత్రాలు, చిరు ఇంద్ర మూవీ కూడా ఆ కాన్సెప్ట్‌లో నుంచి తీసుకున్నదే అని అన్నారు.ఇక బాహుబలి 2 ( Baahubali 2 )కూడా మాణిక్ బాషా నుంచే వచ్చిందని చెప్పుకొచ్చారు ఎస్జే సూర్య.కానీ సరిపోదా శనివారం మాత్రం ఆ ఫార్మాట్‌ లోనే ఉంటూ సరికొత్తగా రాసుకున్నాడని వివేక్ ఆత్రేయ గురించి ఎస్ జే సూర్య చెప్పుకొచ్చాడు.

ఇలా తరచూ ఏదోక విషయంపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తలు నిలుస్తూ ఉంటారు సూర్య.మొన్నటికి మొన్న సరిపోదా శనివారం మెయిన్ థిమ్ ని విడుదల చేసి ట్రోల్స్ కి గురైన ఆయన తాజాగా మరోసారి ఇంద్ర బాహుబలి సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలవడంతోపాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube