ఆంధ్రాలో ఆటోను ఢీ కొట్టిన లారీ ఆరుగురు తెలంగాణ కూలీలు దుర్మరణం...!

నల్లగొండ జిల్లా: ఏపిలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పోందుగుల వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోనిదామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఆరుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందాగా,మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.

దామరచర్ల మండలం నర్సాపురం నుండి ఆంధ్రాలోని దాచేపల్లి మండలం పులిపాడులో మిర్చి తోటలు వేరెందుకు 23 మంది మహిళా కూలీలతో తెల్లవారు జామున బయలుదేరినఆటోను పొందుగుల వద్ద లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.మృతుల వివరాలు ఇస్లావత్ మంజుల (24), భూక్య పద్మ (23),భూక్యా సోనీ(55),మాలోతు కవిత (28),వి.

Six Telangana Laborers Were Killed When A Lorry Collided With An Auto In Andhra,

సక్రి (34) స్పాట్ లో మృతి చెందగా ఇస్లావత్ పార్వతి (35) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుగురికి పెరిగింది.మిగిలిన మహిళా కూలీలు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ఆస్పత్రికి తరలించి,క్షతగాత్రులను మిర్యాలగూడలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.జరిగిన ప్రమాద ఘటనపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు విచారం వ్యక్తం చేశారు.

Advertisement

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని,అందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని చెప్పారు.ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని,మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో,గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.అదే విధంగా మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మృతుల కుటుంబాలకు రూ.60 వేలు ప్రకటించారు.ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్
Advertisement

Latest Nalgonda News