క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ సురేష్ కుమార్

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం సపావత్ తండాలో శ్రీ దత్తాత్రేయ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను తిరుమలగిరి (సాగర్) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ కుమార్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని అన్నారు.

గ్రామాలలో క్రీడల పోటీలు నిర్వహించడం వల్ల యువతలో ఐక్యత పాటు నైపుణ్యతను కూడా కలిగిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ హరి ముని నాయక్,ఉపసర్పంచ్ బిక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Pimples Blemishes : ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మొటిమలే కాదు వాటి తాలూకు మచ్చలు సైతం పరార్!

Latest Nalgonda News