సితార పరిచయం అవసరం లేని పేరు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) నమ్రతల( Namrata ) గారాల పట్టి సితార ( Sitara ) అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు.
పట్టుమని 12 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోని సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే సితార ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.

తరచూ తన తండ్రి సినిమాలోని పాటలకు అలాగే ఇతర పాటలకు కూడా డాన్స్ చేస్తూ సితార ఆ డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు అంతేకాకుండా తన వెకేషన్ లోకి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి.ఇలా మహేష్ బాబు కుమార్తెగా అందరికీ ఎంతో పరిచయమైనటువంటి ఈమె ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక ఇంస్టాగ్రామ్ లో ఇటీవల సితారకు 400 k ఫాలోవర్స్ సొంతం కావడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇలా తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిన సంఖ్యను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో తనకు 400 కే ఫాలోవర్స్ ఉన్నారని తన సోషల్ మీడియా ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గా ఉందని అందరికీ థాంక్యూ లవ్ యు ఆల్ అంటూ ఈమె తనకు ఫాలోవర్స్ పెరగడం గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇలా ఈ విషయాన్ని షేర్ చేస్తూ సితార మిర్రర్ సెల్ఫీ ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటోలో సితార చాలా క్యూట్ గా ఉండడంతో పలువురు ఈ ఫోటోపై కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఈ విధంగా సితార ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంతోనే ఈ స్థాయిలో తనకు అభిమానులు పెరగారని తెలుస్తుంది.ఇక ఇటీవల కాలంలో నమ్రత ఎక్కడికి వెళ్లినా సితారను వెంటపెట్టుకొని వెళ్తున్నారు ఈ క్రమంలోనే ఈమె పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే త్వరలోనే సితార హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి తరుణంలో ఇప్పటినుంచే ఈమెను అందరికీ పరిచయం చేయాలన్న నేపథ్యంలో నమ్రత తన ఇద్దరు పిల్లలని ఏ పార్టీలకు వెళ్లిన ఫంక్షన్లకు వెళ్లిన వెంటనే తీసుకెళ్తున్నారు అనే సంగతి తెలిసిందే.







