వైయస్ షర్మిల( Y.S.Sharmila ) వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా రాజకీయంగా ఎంతో గుర్తింపు సాధించింది.అంతేకాకుండా తెలంగాణలో వైయస్సార్ టిడిపి పేరుతో పార్టీ పెట్టి తెలంగాణ అంతా పర్యటించి పార్టీ బలోపేతానికి ముందుకు సాగింది.
అయినా ఇక్కడ ఆమెకు అనుకున్నంత రాజకీయ సామర్ధ్యాన్ని సాధించలేకపోయింది.దాంతో సైలెంట్ అయిన షర్మిలను కాంగ్రెస్ ఎలాగైనా వారి పార్టీలోకి లాగేసుకోవాలని సకల ప్రయత్నాలు చేసింది.
దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( D.K.Shiva kumar ) తో చర్చలు జరిపి వైయస్ఆర్సిపి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు అన్ని రకాల వ్యూహాలు చేసింది.
దీంతో షర్మిల సోనియా( Sonia ) ,రాహుల్,ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గేను కలిసి పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమవుతుందని, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఇక త్వరలోనే పార్టీ విలీనం చేసి ఆమె కాంగ్రెస్లో కీలకమైన పదవి పొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇలా వార్తలు రాబట్టి దాదాపు 15 రోజులు దాటింది.ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటూ ఆమెను ఢిల్లీలో( Delhi ) తిప్పుతున్నారు తప్ప పదవి ఇచ్చింది లేదు ఆమెని తీసుకున్నది లేదు.
షర్మిలను అంతలా ఆపడానికి ప్రధాన కారణం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అని తెలుస్తోంది.తెలంగాణలోని టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ( Revanth reddy ) తో పాటుగా ఇంకా సీనియర్ లీడర్లు కూడా షర్మిల సేవలను తెలంగాణలో ఉపయోగించుకుంటే అది జగన్ కే ప్లస్ అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కాదని అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది.
దీంతో షర్మిల ఇటు పార్టీ విలీనం చేయలేక, విలీనం చేసినా ఏ పదవి వస్తుందో తెలియక చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది.ఇదే తరుణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన డీకే శివకుమార్ అరంగేట్రం చేసి అధిష్టానానికి షర్మిలకు ఏదో ఒక పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో కాకపోతే ఆమె సేవలను మహారాష్ట్రలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.ఒకవేళ అన్ని సెట్ అయితే పార్టీ విలీనం చేసిన వెంటనే షర్మిల కు కర్ణాటక ( Karnataka ) నుంచి రాజ్యసభ ఆఫర్ తో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
కానీ షర్మిల వీటికి అంగీకరిస్తుందా.లేదా అనేది రాబోవు రోజుల్లో తెలియనుంది.