ఇంట్లోకి పాము దూరిందని కర్ర విసరడంతో ఏడున్నర కోట్ల ఇల్లు ఉష్ కాకి... ఎలాగంటే..?

పాము పేరు వింటే చాలు ఎవరికయినా సరే వెన్నులో వణుకు పుట్టాలిసిందే.ఎందుకంటే పాము కాటేస్తే ప్రాణాలు పోతాయని పాముని చూసి ఎవరయినా భయపడతారు.

 Seven And A Half Crore House Collapse How Come , House, Snake, Stick, Viral Lat-TeluguStop.com

అది చిన్న పామైనా, పెద్ద పాము అయినా సరే పాము కనిపిస్తే చాలు హడలిపోతారు.అయితే అన్ని పాములు ప్రమాదకరమైన విషాన్ని వెదజల్లవు.

కొన్ని పాములు కరిస్తే మాత్రం వెంటనే ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతాయి.కానీ పామును చూసిన వెంటనే అది ప్రమాదకరమైనదా.

లేదా అనే విషయాన్నీ మర్చిపోయి ముందుగా దాన్ని చంపడానికి చూస్తాము.సరిగ్గా అలాగే ఒక వ్యక్తి కూడా పాము ఇంట్లోకి వెళ్లడం చూసి కర్రను విసిరేశాడు అంతే ఒక్కసారిగా అతని ఇల్లు నేలమట్టం అయిపొయింది.ఈ ఘటన వలన అతనికి ఏకంగా 7.50 కోట్ల ఆస్థి నష్టం వచ్చింది.పామును చంపడానికి కర్ర విసిరితే ఆస్థి నష్టం ఎలా వాటిల్లింది అని ఆశ్చర్యపోతున్నారా.?

అసలు వివరాల్లోకి వెళితే.ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.అమెరికాలోని మేరీల్యాండ్‌ కు చెందిన ఒక వ్యక్తి ఇంట్లోకి నవంబరు నెల 23 వ తేది రాత్రి 10 గంటల సమయంలో ఒక పాము వచ్చింది.

అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి ఇంటి బయట క్యాంప్ ఫైర్ వద్ద చలి కాచుకుంటున్నాడు.ఆ పాము తన ఇంట్లోకి వెళ్లడం చూసి అతనికి ఏమి చేయాలో అర్ధం కాక భయపడిపోయాడు.

వెంటనే మండుతున్న పొయ్యిలో నుంచి ఒక కర్రను తీసి ఆ పాముపై వేగంగా విసిరేశాడు.అయితే అతని గురి తప్పి ఆ కర్ర పాముకు తగలకుండా నేరుగా అతని ఇంటి డోర్ కర్టెన్‌పై పడింది.

అంతే క్షణాల్లోనే డోర్ కర్టన్ కు మంటలు అంటుకున్నాయి.ఆ మంటలను అదుపు చేయడం అతని వల్ల కాలేదు.

చూస్తుండగానే మంటలు ఇల్లంతా వ్యాపించి పోయాయి.

ఆ మంటలను చూసి అతడు భయపడి పోయి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు.

వెంటనే 75 మంది ఫైర్ ఫైటర్స్ చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే జరగాలిసిన నష్టం జరిగిపోయింది.ఎందుకంటే అది చెక్కతో కట్టిన ఇల్లు కావడంతో పూర్తిగా తగలబడింది.భవనం లోపల గల ఫర్నిచర్ కూడా బూడిదయింది.మొత్తంగా ఆ ఇంటి ఖరీదు దాదాపు ఏడున్నర కోట్లు ఉంటుందని యజమాని చెప్పాడు.ఎంతో కష్టపడి మరి చాలా ఇష్టంగా ఇల్లు కట్టుకున్నానని అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.తగలబడిన ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం ఈ ఘటన పట్ల నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.నిప్పుతో చెలగాటం, పామును చంపడం మంచిది కాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేసారు.

అసలు ఇంతకీ ఇంట్లోకి దూరిన పాము బతికిందా…? లేక తప్పించుకుని పారిపోయిందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube