ప్రస్తుతం వెండితెరతో సమానంగా దూసుకుపోతుంది బుల్లితెర.ఎన్నో టీవీ సీరియల్స్, ఎన్నో రియాలిటీ షోస్, మరెన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రసారమవుతున్నాయి.
నిజానికి బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు ప్రేక్షకులు.అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ లు అందించడంతో బుల్లితెర బాగా దూసుకుపోతుంది.
దీంతో సీరియల్స్ లో నటించిన నటినటులకు కూడా సినిమా నటీనటులకు ఉన్నంత ఫాలోయింగ్ ఏర్పడింది.ఇక వాళ్లు కూడా సోషల్ మీడియాలో బాగా సమయాన్ని గడుపుతున్నారు.
అందులో కూడా మంచి ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు.ఇక ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తాము చేసే పనిల గురించి సోషల్ మీడియాలో తెలుపుకుంటారు.
ఇప్పటికి చాలామంది బుల్లితెర సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో బాగా క్రేజ్ తెచ్చుకోగా మధ్య మరో బుల్లితెర బ్యూటీ ఐశ్వర్య పిస్సే కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.ఇక ఇదిలా ఉంటే ఈమె షేర్ చేసుకున్న ఫోటోకు నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.
కన్నడ కు చెందిన ముద్దుగుమ్మ ఐశ్వర్య తెలుగు బుల్లితెరకు పరిచయమైంది.తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తన అందంతో కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.తెలుగుతో పాటు కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించింది ఐశ్వర్య.
కన్నడంలో పలు సినిమాలలో కూడా నటించింది.
ఐశ్వర్య కస్తూరి సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే.ఈ సీరియల్ కంటే ముందు అగ్నిసాక్షి సీరియల్ లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఈ సీరియల్ తోనే అభిమానులను సంపాదించుకుంది.
ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో నిలిచింది.ఐశ్వర్య అల్లరి పిల్లగా బాగా పేరు తెచ్చుకుంది.
కేవలం సీరియల్ లోనే కాకుండా పలు ఈవెంట్లలో కూడా పాల్గొని తన డాన్సులతో బాగా రచ్చ చేస్తుంది.ఇక ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.
తొలిసారిగా తాను సినీ ఇండస్ట్రీకి కన్నడ సీరియల్ లో అడుగుపెట్టింది.సర్వమంగళ మాంగళ్య అనే సీరియల్ తో తొలిసారిగా తన నటన జీవితాన్ని ప్రారంభించింది.ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి అగ్నిసాక్షి సీరియల్ తో పరిచయమైంది.ఇక ఈమె నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి అన్నయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్యకు తన భర్త సపోర్ట్ ఉండటంతో ఇండస్ట్రీలో కొనసాగుతుంది.ఇక తాజాగా తను ఇన్ స్టా లో ఒక స్టోరీ పంచుకుంది.ఇక అందులో ఆల్కహాల్ ఫోటో షేర్ చేస్తూ పడుకునే ముందు సిప్ అంటూ పంచుకుంది.ఒక ఆ స్టోరీ చూసిన నెటిజన్లు అలా తాగితే అందం పోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.