ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కి అలెర్ట్ ...!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) వినియోగదారులకు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లపై ప్రాసెసింగ్ ఫీజు రూ.99లు అదనంగా వసూలు చేయనున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది.ఇటీవల విడుదల చేసిన ఈమెయిల్ ప్రకారం ఇలా ఉంది.‘డిసెంబర్ 1, 2021 నుంచి మర్చంట్ ఈఎమ్ఐ లావాదేవీల పై పన్నులతో పాటు రూ.99 లు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయనున్నాం.ఎస్బిఐ క్రెడిట్ ద్వారా ఈ కామర్స్ వెబ్సైట్లు, మర్చంట్ అవుట్లెట్లు, యాప్ లలో జరిపే లావాదేవీలకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే.ఈ ఫీజు వర్తిస్తుంది’ అని ఎస్బిఐ పేర్కొంది.

 Sbi, Credit Card, Alerts, Latest News, Extra Charges-TeluguStop.com

ఒకవేళ ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసి ఈఎంఐగా మార్చుకోవాలంటే ఈ ఫీజు తప్పక భరించాల్సిందేనని ఎస్బిఐ పేర్కొంది.దీనివలన ఎస్బిఐ వినియోగదారులకు మరింత భారం పెరుగుతుంది.

కనుక ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేయాలనుకునే వారు కాస్త ఆలోచించాల్సిందే.

Telugu Credit, Extra, Latest-Latest News - Telugu

ఎస్బిఐ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ప్రకారం ఎవరైనా ఈ- కామర్స్ వెబ్సైట్లో మొబైల్ ఫోన్ కొని దానికి ఈఎంఐ ఆప్షన్ పెట్టాలనుకున్నప్పుడు ఆ చెల్లింపులను ఎస్బిఐ క్రెడిట్ కార్డు తో చేస్తే తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా రూ.99 ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.అయితే క్రెడిట్ కార్డ్ లో స్టేట్మెంట్ లో ఈఎంఐ అమౌంట్ తో పాటు కలిపి కనిపిస్తుంది.

ఒకవేళ ఈఎంఐ లావాదేవీ రద్దు అయితే తిరిగి ఆ ఫీజును చెల్లించనున్నట్లు ఎస్బిఐ తెలిపింది.

అయితే ప్రాసెసింగ్ ఫీజుకు, ఇంట్రెస్ట్ చార్జీలకు ఎలాంటి సంబంధం లేదని, జీరో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లోనూ ఈ ప్రాసెసింగ్ ఫీజు అదనంగా వర్తిస్తుందని ఎస్బిఐ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube