బాహుబలి తర్వాత పాకిస్తాన్ లో అలా పిలిచారు.. వైరల్ అవుతున్న సత్యరాజ్ కామెంట్స్!

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న వాళ్లలో సత్యరాజ్ ఒకరు.కట్టప్ప పాత్రతో సత్యరాజ్( Sathyaraj ) ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Satyaraj Comments Goes Viral In Social Media Details Here Goes Viral In Social M-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సత్యరాజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Telugu Baahubali, Kattappa, Kollywood, Rajamouli, Sathyaraj, Tollywood, Weapon-M

వెపన్ సినిమా( Weapon Movie ) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా సత్యరాజ్ మాట్లాడుతూ ఒక నటుడిని తన పేరుతో పోల్చి చూస్తే పాత్ర పేరుతో పిలవడం గొప్ప బహుమతి అని తెలిపారు.బాహుబలి తర్వాత నన్ను సత్యరాజ్ అని పిలవడం మానేశారని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కట్టప్ప అని పిలుస్తున్నారని సత్యరాజ్ అన్నారు.ఈ తరహా గుర్తింపు రావడం నటులకు సక్సెస్ తో సమానమని సత్యరాజ్ వెల్లడించారు.

Telugu Baahubali, Kattappa, Kollywood, Rajamouli, Sathyaraj, Tollywood, Weapon-M

బాహుబలి2( Baahubali 2 ) మూవీ విడుదలైన తర్వాత రాజమౌళి జపాన్, పాకిస్తాన్ కు వెళ్లారని అక్కడ షాపు యజమానులు తనకు కట్టప్ప రోల్ అంటే ఇష్టమని చెప్పారని వాళ్లు కూడా నన్ను కట్టప్పగానే పిలిచారని సత్యరాజ్ పేర్కొన్నారు.రాజమౌళి వల్లే ఆ పాత్రకు ఊహించని స్థాయిలో ఆదరణ దక్కిందని సత్యరాజ్ కామెంట్లు చేశారు.వెపన్ మూవీ కూడా బాహుబలి స్థాయిలో సక్సెస్ సాధిస్తుందని సత్యరాజ్ అన్నారు.సత్యరాజ్ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.సత్యరాజ్ తెలుగులో మరిన్ని సినిమా ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు భావిస్తున్నారు.సత్యరాజ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఆయన ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.

సత్యరాజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.సత్యరాజ్ పారితోషికం రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

ఇతర భాషల్లో సైతం సత్యరాజ్ సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube