సమంత ఫ్యాన్స్‌ ఎదురు చూపులు.. మళ్లీ ఖుషి అయ్యేది ఎప్పుడో?

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే ఖుషి సినిమా( Khushi movie ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా లో నటించిన సమంత చాలా కాలం తర్వాత ఒక బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ సినిమాలు సొంతం చేసుకుంది.

 Samantha Fans Want Citadel Web Serises Update , Citadel , Samantha , Samantha F-TeluguStop.com

ఈ నేపథ్యం లో సమంత ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు సమంత నటించిన ఇతర సినిమా లు మరియు సిరీస్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Bollywood, Citadel, Khushi, Samantha, Samantha Fans, Tollywood, Varun Dha

ముఖ్యంగా హాలీవుడ్ లో సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న సిటాడిల్ సిరీస్( Citadel ) ను హిందీ భాష లో చేయడం జరిగింది.ప్రముఖ హిందీ ఫిలిం మేకర్స్ దర్శకత్వం లో ఈ వెబ్ సిరీస్ రూపొందింది.షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి దాదాపు మూడు నాలుగు నెలలు కాబోతుంది.అయినా కూడా ఇప్పటి వరకు స్ట్రీమింగ్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వక పోవడం తో సమంత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bollywood, Citadel, Khushi, Samantha, Samantha Fans, Tollywood, Varun Dha

ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటూ వారు ఆగ్రహం తో ఊగి పోతున్నారు.ప్రస్తుతం సమంత( Samantha ) బ్రేక్ తీసుకుంది.ఏడాది పాటు ఆమె కొత్త సినిమా లకు కమిట్ అవ్వను అంటూ క్లారిటీ ఇచ్చింది.అయితే ఆమె ఈ బ్రేక్ లో సిటాడెల్ సినిమా సిరీస్ యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

కానీ మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు స్ట్రీమింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వక పోవడం తో ఈ సంవత్సరం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంతకీ సమంత నటించిన ఆ వెబ్ సిరీస్ ఎప్పటికి స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలి అంటే అమెజాన్ వారి నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మొన్నటి వరకు విదేశాల్లో ఉన్న సమంత ఇప్పుడు తిరిగి చెన్నై చేరుకుంది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube