నల్లగొండలో విషాదం నింపిన వర్షం

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ ఇంటిగోడ కూలి తల్లీబిడ్డలు మృత్యువాత పడిన విషాద సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే,స్థానికులు,పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నదికూడ లక్ష్మి (42),నదికూడ కళ్యాణి (21) అనే తల్లీకూతుళ్ళు శ్రీకాకుళం నుండి కొన్ని సంవత్సరాల క్రింద వలస వచ్చి నల్గొండ రైల్వే స్టేషన్ లో రైల్వే కూలీలుగా పని చేస్తూ స్థానిక పద్మానగర్ లో నివాసముంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వారు నివాసముంటున్న ఇంటిగోడలు పూర్తిగా తడిసి,వారు నిద్రలో ఉన్నప్పుడే వారిమీద కూలిపోయాయి.అక్కడే ఉన్న బీరువా వారి మీద పడడంతో నిద్రలో ఉన్న తల్లీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు.

Sad Rain In Nalgonda-నల్లగొండలో విషాదం నిం

కూతురు కళ్యాణికి ఈ మధ్యే వివాహం అయ్యింది,ఆషాడమాసం వల్ల తల్లి ఇంటికి వచ్చింది.ఇంతలోనే ఇలా జరగడం పట్ల స్థానికులు కంటతడి పెట్టారు.

ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్ఐ పరిస్థితిని పరిశీలించి, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత

Latest Nalgonda News