ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు ప్రవేశ పెడుతూ తమ యూజర్లకు సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ క్రమంలో యూజర్లకోసం తాజాగా మరొక ఫీచర్ అందుబాటులోకి తీసుకొని వచ్చింది.
బేసిగ్గా మనం మనం వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలి అనుకుంటే వెరిఫికేషన్ అడుగుతుంది కదా.తరువాత మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ద్వారా లాగిన్ అవుతూ ఉంటాము.అయితే కొన్ని కొన్ని సార్లు సిగ్నల్స్ సరిగా లేకపోవడం వల్ల ఈ OTPలు సరిగ్గా రాక, ఇబ్బంది పడుతూ ఉంటాము కదా!
ఈ సమస్యను గుర్తించిన వాట్సాప్ దానికి ఓ అద్భుతమైన సొల్యూషన్ కనిపెట్టింది.అందుకోసమని ఇకపై శ్రమ లేకుండా ఫ్లాష్ కాల్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఇదే విషయాన్ని వాట్సాప్ గురించి సమాచారాన్ని అందించే ‘వాబిటాఇన్ఫో” తాజాగా తెలిపింది.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లోనే వుంది.అతి త్వరలో ఈ వాట్సాప్ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.దీని ద్వారా వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈజీగా, వేగంగా అకౌంట్ లాగిన్ కావచ్చు.
ఈ క్రమంలో సిగ్నల్ బెదడలను అధిగమించవచ్చు.
ఇక ఈ ఫ్లాష్ కాల్స్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు OTPని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
సదరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP రాకున్నప్పటికీ లాగిన్ విజయవంతంగా పూర్తవుతుంది.యూజర్ ఇచ్చిన మొబైల్ నెంబర్ కు వాట్సాప్ మిస్డ్ కాల్ ఇస్తుంది.ఇక అదే నెంబర్ పై వాట్సాప్ లాగిన్ చేస్తున్నట్టు ధృవీకరణ చేసుకొని లాగిన్ పూర్తి అవుతుంది.ఈ కొత్త విధానంతో లాగిన్ అనేది సెకెన్ల వ్యవధిలో జరిగిపోతుంది.
అయితే దీనికంటే ముందు వాట్సాప్ కాల్స్, SMS రీడ్ చేసేందుకు అడిగిన అన్ని పర్మిషన్స్ సదరు యూజర్ ఇవ్వాల్సి ఉంటుంది.