ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందా.ముగియనుందా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వచ్చేనెలలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది.
మరోసారి వెంకయ్యకు ఉపరాష్ట్రపతిగా అవకాశం లేదని ఢిల్లీలోని ప్రస్తుత పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది.
అయితే కేంద్ర మంత్రిగా ముక్తార్ అబ్బాస్ నక్వీ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టతగానే ఉన్నారని అర్థమవుతోంది.
మోదీకి ముక్తాస్ అబ్బాస్ నక్వీ విధేయుడిగా ఉంటారనే పేరుంది.గిరిజనులను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన దృష్ట్యా ఈసారి మైనార్టీ వర్గాలను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది.
ఈ కోణంలో చూస్తే నక్వీకి ఉపరాష్ట్రపతిగా అవకాశం రావడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.
దీంతో భవిష్యత్‌లో వెంకయ్యనాయుడి పరిస్థితి ఏంటి అన్నది అందరూ చర్చించుకుంటున్నారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగిన తర్వాత ఫక్తు రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తులు కనిపించడం అరుదు.ఇప్పటివరకు చూసుకుంటే అలా కనిపించిన దాఖలాలు తక్కువే.కాంగ్రెస్ పార్టీలో తలపండిన ప్రణబ్ ముఖర్జీ సైతం రాష్ట్రపతి పదవి తర్వాత రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించలేదు.దీంతో వెంకయ్యనాయుడు కూడా రాజకీయాల్లో కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు.
మరోవైపు వెంకయ్యనాయుడు సన్నిహితులు, రాజకీయ సమకాలికులు ఆయన్ను వాడుకుని వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభలో గతంలో బీజేపీకి తగినంత బలం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులను ఆమోదించడంలో రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు బాధ్యతలు నిర్వర్తించలేదని వెంకయ్యనాయుడిపై బీజేపీ గుర్రుగా ఉంది.అయితే ప్రతిపక్ష సభ్యులను సస్సెండ్ చేసి సభను సజావుగా నడిపారు.ఇది మోదీ సర్కారుకు మేలు చేసినా ఆ విషయాన్ని గుర్తించడం లేదు.
దీంతో వెంకయ్యకు మరోసారి ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తోంది.వెంకయ్య పదవీ విరమణ చేసిన తర్వాత తన కుమార్తెకు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్‌లో పూర్తిగా తలమునకలు అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.