టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) ఏపీ హైకోర్టులో( AP High Court ) ఊరట లభించింది.ఈ మేరకు మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.
ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ లిక్కర్ కేసుతో పాటు అక్రమ ఇసుక కేసులో కూడా చంద్రబాబుకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కేసులపై మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.అలాగే టీడీపీ నేత కొల్లు రవీంద్రకు( Kollu Ravindra ) కూడా మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది.