మాస్ మహా రాజా రవి తేజ బ్యాక్ టు బ్యాక్ సినిమా లతో ఫ్లాప్స్ ని మూట కట్టుకుంటున్నాడు.డిసెంబర్ లో త్రినాధ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందిన ధమాకా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రవి తేజ రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
తాజాగా దీపావళి సందర్భం గా సినిమా నుండి ఆసక్తికర వీడియో ఒకటి విడుదల చేయడం జరిగింది.వీడియో లో రవితేజ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.
పాత్ర కూడా చాలా మాస్ గా ఉండబోతుందని వీడియో చూస్తుంటే అర్థమవుతుంది.అభిమానులు ఆయన ను ఇలాగే చూడాలని కోరుకుంటున్నారు, కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం రెగ్యులర్ గా అవే పాత్రలు అవే మూస తరహా చిత్రాలు చేయడం తో రవితేజ సినిమాలను తిరస్కరిస్తున్నారు.
ధమాకా సినిమా అయినా అందుకు విభిన్నంగా ఉంటుందని భావించారు, కానీ రవితేజ మళ్ళీ అదే మూస తరహా మాస్ పాత్రల నే చేసినట్లుగా ధమాకా టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.ఇప్పటికే సక్సెస్ లేక చాలా ఢీలా పడి పోయిన రవితేజ మళ్లీ పుంజుకోవాలంటే ఈ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.మరి ఈ సినిమా తో అయినా రవితేజ సక్సెస్ దక్కించుకొని మళ్లీ తన పూర్వ వైభవం ను దక్కించుకుంటాడా.లేదంటే వాల్తేరు వీరన్న సినిమా తర్వాత వరుసగా ఇతర హీరో ల సినిమాల్లో నటించాల్సి వస్తుందా అనేది చూడాలి.
రవి తేజ కు జోడీ గా ఈ సినిమా లో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలా నటించిన విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ధమాకా సినిమా డిసెంబర్ లో సోలోగా విడుదల కాబోతున్న నేపథ్యం లో మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.