తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఏడో వారం కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది.ఇంటిసభ్యులు టాస్క్ లు సరిగ్గా ఆడలేదు అని బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ఫైర్ అవడంతో పాటు కడుపు మారితే ఎలా ఉంటుంది అని చూపించాడు.
అంతే కాకుండా హౌస్ లో ఉండడానికి హౌస్ మేట్స్ కు తమకు అర్హత ఉందని నిరూపించుకోవాలి అన్న టాస్క్ ను కూడా ఇచ్చాడు.అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఆకలితో అలమటిస్తుండడంతో తిరిగి ఫుడ్ ని పంపించాడు.
అంతకంటే ముందుగా హౌస్ మేట్స్ ఇకపై 100% ఎఫర్ట్స్ పెట్టి ఎంటర్టైన్ చేస్తామని ప్రతిజ్ఞ చేసిన తరువాత హౌస్ మేట్స్ కి ఫుడ్ పంపించాడు.
తర్వాత ఇనయా, శ్రీహన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడంతో అందరూ కలిసి శ్రీహన్ ను ఆటపట్టించారు.
ఆ తర్వాత బిగ్ బాస్ బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ను ఇవ్వగా మిగిలిన కంటెస్టెంట్ లో రెండు గ్రూపులుగా డివైడ్ అవ్వడంతో శ్రీ సత్య లీడర్ గా కొనసాగింది.ఈ టాస్క్ లో భాగంగా శ్రీహన్ చేతిలో ఉన్న బొమ్మను శ్రీ సత్య లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె కింద పడింది.
ఇక రేవంత్ ఏం చేసినా శ్రీ సత్య పాయింట్ అవుట్ చేస్తూ ఉండడంతో వెంటనే రేవంత్ సహనం కోల్పోయే శ్రీ సత్య పై ఫైర్ అయ్యాడు.
అప్పుడు అవకాశం దొరికింది కదా అనుకున్న అర్జున్ అతడినే నామినేట్ చెయ్ అంటూ శ్రీ సత్య కు సలహా ఇచ్చాడు.కానీ శ్రీ సత్య మాత్రం అతన్ని నామినేట్ చేసిన బయటకు వెళ్ళడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోవాల్సిందే అని చెప్పింది.అంతేకాకుండా ఈ టాస్క్ లో బాగా రెండు లెవల్లో కంటెస్టెంట్లు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లారు.
కాళ్లు అడ్డం పెట్టాడని అర్జున్ ని రేవంత్, నెట్టేసాడని ఆదిరెడ్డి వాసంతి కొట్టింది.