ఇంత కన్ఫ్యూజన్‌ ఎందుకు చరణ్‌?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా తర్వాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను చేస్తాడని వార్తలు వచ్చాయి.

 Ramcharan Is Confussion In Next Movie, Ramcharan, Sandeep Reddy Vanga, Rrr, Raja-TeluguStop.com

జర్సీ చిత్రంతో విభిన్నమైన దర్శకుడిగా పేరు దక్కించుకున్న ఆయన చరణ్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేశాడంటూ ప్రచారం జరిగింది.తీరా ఇప్పుడు మరో దర్శకుడి పేరు ప్రచారంలోకి వచ్చేసింది.

ఇలా ఎంతో మంది దర్శకుల పేర్లు చరణ్‌ పరిశీలనలోకి వచ్చాయి.

స్టార్‌ సీనియర్‌ దర్శకుల నుండి కొత్త దర్శకుల వరకు చరణ్‌ కు పదుల సంఖ్యలో కథలు చెప్పారు.

కాని ఇప్పటి వరకు చరణ్‌ దేనికి కన్ఫర్మ్‌ చెప్పాడు అనేది మాత్రం తెలియడం లేదు.తాజాగా అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ కూడా చరణ్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కాని మీడియా వర్గాల్లో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారం ప్రకారం చూస్తే సినిమా ఖచ్చితంగా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందేమో అంటున్నారు.

Telugu Arjun Reddy, Jersey, Rajamouli, Ramcharan, Sandeepreddy-

అర్జున్‌ రెడ్డి తమిళం మరియు హిందీల్లో తెరకెక్కించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి ఇప్పటి వరకు తదుపరి చిత్రంను మొదలు పెట్టలేదు.ఎప్పుడు ఆయన తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకుంటాడు అనేది క్లారిటీ లేదు.ఈ సమయంలోనే చరణ్‌ తో మూవీకి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అంత సీన్‌ ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరి చరణ్‌ నిర్ణయం ఏంటో మాత్రం తెలియదు.చరణ్‌ తదుపరి చిత్రం విషయంలో చాలా కన్ఫ్యూజ్‌గా ఉండి చాలా కథలు వింటున్నాడు.చివరకు దేనికి ఓకే చెప్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube