Ram gopal varma Dangerous: రామ్‌ గోపాల్‌ వర్మ డేంజరస్ ఫిల్మ్ పబ్లిక్ టాక్.. దారుణంగా ట్రోల్స్!

ఒకప్పుడు శివ, క్షణక్షణం లాంటి ఉత్తమ చిత్రాలు అందించి ఇండస్ట్రీ హిట్‌కొట్టిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.ఇప్పుడు సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకొని ఏవేవో సినిమాలు తీస్తున్నాడు.

 Ram Gopal Varma Dangerous Film Public Talk Shocks Everyone, Ram Gopal Varma, Tol-TeluguStop.com

క్రమంగా కథల పరంగా కాకుండా హాట్‌ టాపిక్‌ ఏది ఉంటే అది తీసుకొని సినిమాలు చేస్తూ క్యాష్‌ చేసుకుంటున్నాడు.ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులను తీసుకొచ్చిన ఆర్జీవీ.

చాలా మంది నటీనటులకు కూడా లైఫ్‌ ఇచ్చారనేది కాదనలేని వాస్తవం.

ఒకప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ మూవీ అంటే ప్రేక్షకులు ఎగబడి చూసే వారు.

అంతలా కట్టి పడేసేవి వర్మ సినిమాలు.అప్పట్లో ఆయన సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉండేది.క్రమంగా ఇప్పుడు ఆర్జీవీ దారి తప్పాడని ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు.దాదాపు బూతు సినిమాలు చేస్తూ సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాడనే అపవాదు మూటగట్టుకుంటున్నాడు.

రీసెంట్‌గా వస్తున్న సినిమాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.రాజకీయంగానూ హాట్‌ కామెంట్స్‌ చేస్తుంటాడు రామ్‌ గోపాల్‌ వర్మ.

అది కూడా ప్రత్యేకించి కొంత మంది రాజకీయ నేతలను టార్గెట్‌ చేసి ఏకంగా సినిమాలు కూడా చేసి హిట్‌ కొట్టాడు వర్మ.ఈ కోవలోని సినిమాలే పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రక్త చరిత్ర, వంగవీటి రంగా జీవిత కథ వంగవీటి, ఎన్టీఆర్‌ జీవిత కథ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, రీసెంట్‌గా వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక తీసిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ.

Telugu Apsara Rani, Ram Gopal Varma, Tollywood-Movie

రొమాన్స్‌ కావాలంటే అక్కడ కూడా.మరోవైపు ఏకంగా బ్లూ ఫిల్మ్‌ల రేంజ్‌లో తీసిన క్లైమాక్స్‌, డేంజరెస్‌ లాంటి సినిమాలు కూడా జనాలమీదకు వదిలారు రామ్‌ గోపాల్‌ వర్మ.వీటిలో ఏకంగా అడల్ట్‌ కంటెంట్‌ శృతి మించి ఉండటంతో ఫ్యామిలీతో చూడలేకపోతున్నారు ఆడియన్స్‌.టీనేజ్‌ యువకులకు నచ్చుతుందేమో కానీ ఈ తరహా సినిమాలు అన్ని వర్గాలకూ నచ్చవని అభిమానులు మండిపడుతున్నారు.

రొమాన్స్‌ కావాలంటే ఏ బ్లూ ఫిల్మ్‌ చూసినా దొరుకుతుందని, కంటెంట్‌, కథ బాగుండాలని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube