రెడ్ టవల్ తో బాబాయ్ ను గుర్తు చేసిన రామ్ చరణ్.. హైప్ భారీగా పెంచేశాడుగా!

తాజాగా వినాయక చవితి పండుగ ( Vinayaka Chavithi festival )సందర్భంగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటిస్తున్న చేంజర్ సినిమా నుంచి ఒక సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా నుంచి రెండవ సాంగ్ సెప్టెంబర్ లో రానుంది అని చెబుతూ ఒక అప్డేట్ ని ఫోటో రూపంలో విడుదల చేశారు మూవీ మేకర్స్.

 Ram Charan New Poster Comparing With Pawan Kalyan And Chiranjeevi, Ram Charan, P-TeluguStop.com

ఇకపోతే తాజాగా షేర్ చేసిన ఆ పోస్టర్లో రామ్ చరణ్ లుక్ బాగా వైరల్ అవుతోంది.ఆ పోస్టర్లో ఉన్న రాంచరణ్ ఫోటోని బట్టి చూస్తే అది ఒక సాంగ్ లోని ఫోటో అని తెలుస్తోంది.

ఇందులో రామ్ చరణ్ తలకు రెడ్ టవల్ ( Red towel )కట్టుకొని ఉన్నారు.

Telugu Chiranjeevi, Game Changer, Pawan Kalyan, Ram Charan, Ramcharan-Movie

రెడ్ టవల్ పవన్ కళ్యాణ్ వల్ల బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.గబ్బర్ సింగ్ సినిమా ( Gabbar Singh movie )సమయంలో సినిమాలో వాడటమే కాకుండా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ రెడ్ టవల్ మీద వేసుకోవడంతో బాగా వైరల్ అయింది.ఇప్పుడు రామ్ చరణ్ తలకు రెడ్ టవల్ కట్టుకున్న పోస్టర్ రిలీజ్ చేయడంతో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ని చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పోలుస్తున్నారు.

ఆ ఫోటోని చూస్తే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ని గుర్తొస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు మెగా అభిమానులు.పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఇలా రెడ్ టవల్ తలకు చాలా సార్లు కట్టుకున్నాడు.

Telugu Chiranjeevi, Game Changer, Pawan Kalyan, Ram Charan, Ramcharan-Movie

అలాగే మెగాస్టార్ చిరంజీవి గతంలో ముఠామేస్త్రి సినిమాలో( Muthamestri ) తలకు ఒక కార్మికుడిగా రెడ్ టవల్ కట్టుకున్నారు.దీంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తలకు రెడ్ టవల్స్ కట్టుకున్న ఫొటోలు తీసి వాటి పక్కన ఇప్పటి చరణ్ ఫోటో పెట్టి నాన్న, బాబాయ్ లను గుర్తుచేస్తున్నారు చరణ్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.ఇకపోతే చరణ్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అంతకంతకూ లేట్ అవుతూ వస్తోంది.మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏంటో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube