కేజిఎఫ్ 2 టీమ్ గురించి అలా మాట్లాడిన రజినీకాంత్.. ఏం మాట్లాడారంటే?

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ 2 .ప్రస్తుతం ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంది.

 Rajinikanth Talks About The Kgf2 Team Do You Know He Talking About, Rajinikanth,-TeluguStop.com

ఎవరూ ఊహించని రీతిలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.కేజిఎఫ్ సినిమా కు సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా ప్రస్తుతం దేశమంతటా కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.

హీరో ఎస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు దేశమంతటా మార్మోగి పోతున్నాయి.దర్శక ధీరుడు రాజమౌళి స్థాయిలో ప్రశాంత్ నీల్ ఈ కేజిఎఫ్ 2 చిత్రాన్ని రూపొందించారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రాజమౌళి, ప్రశాంతి నీల్ తమ సినిమాలతో మన భారతీయ చలనచిత్ర స్థాయిని అమాంతం పెంచేశారు.ప్రస్తుతం కేజిఎఫ్2 సినిమా విడుదలై ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంశలను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కేజిఎఫ్2 సినిమా మీద ప్రశంసలు కురిపించాడు.రజినీకాంత్ కేజిఎఫ్ 2 సినిమా చూసిన తర్వాత స్వయంగా నిర్మాతకు ఫోన్ చేసి సినిమా బాగా తీశారు అంటూ ప్రశంసించాడు.

ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకోవడంతో వారి ఆనందం మాటల్లో చెప్పలేక పోతున్నారు.

Telugu Yash, Kgf, Kollywood, Rajinikanth, Tollywood-Movie

రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ మరియు అరుణ్ రాజ్ కామరాజు దర్శకత్వంలో రెండు సినిమాలు చేయబోతున్నాడు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు మొదలు కానున్నట్టు సమాచారం.తమిళ ఇండస్ట్రీలో కేజిఎఫ్ 2 సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.దీంతో ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేందుకు ఈ సినిమా కోసం థియేటర్లు పెంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube