జక్కన్న సొంతంగా కథలు రాయలేరా.. అలాంటి ప్రాజెక్ట్ ను ఎప్పుడు చూస్తామంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి( Director SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Rajamouli Movie With Own Writing Story Details, Rajamouli, Rajamouli Writing Sto-TeluguStop.com

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు రాజమౌళి.ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించాయి.

ఇకపోతే చివరగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో తెలుగు సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారు జక్కన్న.

దీంతో తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి.

Telugu Ss Rajamouli, Mahesh Babu, Pan India, Rajamouli, Rajamouli Story, Tollywo

కాగా రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో( Mahesh Babu ) చేయబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు.మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ ని రూపొందిస్తున్నారు.

అయితే క్రియేట‌వ్ గా సీన్స్ క్రియేట్ చేయ‌డంలో జ‌క్క‌న్న విజ‌న్ కి స‌లాం కొట్టాల్సిందే.కానీ రాజ‌మౌళి సినిమా విష‌యంలో ఆ ఒక్క‌టే త‌క్కువైంది.అదే సొంత క‌థ‌తో స‌త్తా చాట‌లేక‌పోవ‌డం.రాజ‌మౌళి సినిమా చేయాలంటే వెనుక నుంచి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్( Vijayendra Prasad ) క‌థ అందించాల్సిందే.

ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌మౌళి సొంత క‌థ‌తో సినిమా లేదు.తొలి సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ కి స్టోరీ అందించింది పృథ్వీరాజ్.

Telugu Ss Rajamouli, Mahesh Babu, Pan India, Rajamouli, Rajamouli Story, Tollywo

ఆ త‌ర్వాత తెర‌కెక్కించిన సింహాద్రి,సై,ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు, య‌మ‌దొంగ‌, మ‌గ‌ధీర‌, బాహుబ‌లి,రెండు భాగాల‌కు, ఆర్ఆర్ఆర్ వ‌ర‌కూ అన్ని సినిమాలకు జక్కన్న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కథ లను అందించారు.మ‌ధ్య‌లో ఈగ సినిమాకి మాత్రం విజ‌యేంద్ర ప్ర‌సాద్ కేవ‌లం కాన్సెప్ట్ మాత్ర‌మే ఇచ్చారు.ఆ క‌థ‌ని ఎస్టాబ్లిష్ చేసింది రాజ‌మౌళి.మ‌ర్యాద రామ‌న్న‌ కు ఎస్.ఎస్ కాంచి స్టోరీ ఇచ్చారు.దాన్ని విస్త‌రించ‌డంలో రాజ‌మౌళి పాత్ర ఉంది.

అలా ఆ రెండు సినిమాల ప‌రంగా రాజ‌మౌళి స్టోరీ రైటింగ్ లో పనీ చేసారు.తండ్రి క‌థ‌ల్లో కేవ‌లం భాగ‌స్వామిన‌కే ప‌రిమితం.

కానీ సొంత క‌థ కోసం మాత్రం తాను ఇంకా క‌లం ప‌ట్ట‌లేదు.దీంతో రాజమౌళి సొంత క్రియేటివిటీతో ఒక క‌థ సిద్దం చేసి సినిమా తీస్తే చూడాల‌ని ఆయ‌న పాన్ ఇండియా అభిమానులు ఆశీస్తున్నారు.

సౌత్ నుంచి పాన్ ఇండియాలో సినిమాలు చేసిన ప్ర‌శాంత్ నీల్, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, చందు మొండేటి, రిష‌బ్ శెట్టి వీళ్లంతా సొంత క‌థ‌ల‌తోనే సినిమాలు చేసి స‌క్సెస్ అందుకున్నారు.వాళ్ల స‌ర‌స‌న రాజ‌మౌళి ఎప్పుడు చేర‌తారు అన్న‌ది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube