ఆ అమ్మాయి చేతిలో మోసపోయిన రాజ్ తరుణ్.. అంతు చూస్తానంటూ?

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలలో నటించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపవుతున్నాయి.రాజ్ తరుణ్ నటించిన కొన్ని సినిమాలు థియేటర్లలో ఎప్పుడు విడుదలయ్యాయో ఆయన అభిమానులకు కూడా తెలియదంటే ఆ సినిమాల పరిస్థితి ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

 Raj Tarun Movie Promotions Video Goes Viral In Social Media Details, Raj Tarun,-TeluguStop.com

అయితే రాజ్ తరుణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.రాజ్ తరుణ్ ఆ వీడియోలో ఒక అమ్మాయి గురించి మీకు చెప్పడం కోసమే అకస్మాత్తుగా ఈ వీడియో చేస్తున్నానని నా లైఫ్ లో అమ్మాయి గురించి మాట్లాడే ఛాన్స్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు.

నా లైఫ్ కు లవ్ సెట్ కాదని భావించి పెళ్లి చేయమని పేరెంట్స్ ను కోరానని రాజ్ తరుణ్ అన్నారు.

పేరెంట్స్ మంచి పెళ్లి సంబంధం చూశారని అయితే పెళ్లిరోజున అమ్మాయి జంప్ అని రాజ్ తరుణ్ అన్నారు.

ఆ సమయంలో చుట్టాలంతా సానుభూతితో చూశారని ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా వదలనని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

ఆ అమ్మాయి అంతు చూస్తానని ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా పట్టుకుంటానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు.రేపే అమ్మాయి ఫోటో ఆన్ లైన్ లో పెడుతున్నానని అమ్మాయి కనిపిస్తే చెప్పాలని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

రాజ్ తరుణ్ తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విధంగా వీడియో చేశాడని తెలుస్తోంది.

అయితే సెలబ్రిటీలు ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయడం ద్వారా సినిమాలకు చెడు ఎక్కువగా జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుస ఫ్లాపుల నేపథ్యంలో రాజ్ తరుణ్ కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Actor Raj Tarun Video Viral Social media

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube