రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కేసీఆర్, మోదీ లపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అనేక పార్టీలతో పోరాడుతుందని స్పష్టం చేశారు.
రాజకీయాలలో మనం ఎవరిపై పోరాడుతున్నామో అవగాహన ఉండాలి.తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నిటితో పోరాడుతున్నామని రాహుల్ స్పష్టం చేశారు.
అయితే పార్టీల పరంగా చూస్తే బీఆర్ఎస్, బీజేపీ( BJP ) వేరువేరుగా కనిపిస్తాయి.కానీ అవన్నీ కలిసే ఉన్నాయని పేర్కొన్నారు.
పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతూనే ఉంది.కేసీఆర్( CM KCR ) పై బీజేపీ ఎలాంటి కేసులు పెట్టదని పేర్కొన్నారు.ప్రధాని మోదీ దేశ సంపదను ఆదానీకి దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అందువల్లే ఆదానీ ప్రపంచ కుబేరుడుగా మారారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో పార్లమెంటులో మోడీ.ఆదానీ బంధం గురించి తాను చేసిన వ్యాఖ్యలకు తనని సస్పెండ్ చేశారని రాహుల్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రజల ఆస్తిని కుటుంబానికి పంచుతున్నారని రాహుల్ ఆరోపించారు.ఇక ఇదే సభలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని ఆనాడు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇల్లు ఇస్తామని తెలిపారు.తెలంగాణలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.