మునుగోడును రెవెన్యూ డివిజన్ చెయ్యాలని రాస్తారోకో

నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో రెవిన్యూ డివిజన్ హక్కుల సాధన సమితి జేఏసి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి,ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం జేఏసీ నాయకులు పాలకూరి నరసింహ్మ గౌడ్,సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మునుగోడులో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్షం తగదన్నారు.

నియోజకవర్గ కేంద్ర హక్కుల సాధనకై మండల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమములో పోలగోని సత్యం,నన్నురి విష్ణువర్ధన్ రెడ్డి,పాల్వాయి చెన్నారెడ్డి, జిట్టగోని యాదయ్య,మేక ప్రదీప్ రెడ్డి,పందుల భాస్కర్,యసరాని శ్రీను, యసరాని దినేష్,పందుల సురేష్,తీగల శశి,పులకరం హనుమంత్,బొమ్మగోని అనిల్,స్వామి తదితరులు పాల్గొన్నారు.

Protest For Munugode Revenue Division, Protest ,munugode Revenue Division, Munug

Latest Nalgonda News