అయితగోని అనితకి ప్రమోషన్

నల్గొండ జిల్లా:జిల్లాలో బీజేపీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకురాలు అయితగోని అనితకు పార్టీలో ప్రమోషన్ లభించింది.ఆమెను నల్లగొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలుగా నియమించారు.

దానికి సంబంధించిన నియామక పత్రాన్ని గురువారం ఆమెకు జిల్లా బీజేపీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ పార్టీ పట్ల తనకున్న విశ్వసనీయతను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి,సహకరించిన బీజేపీ రాష్ట్ర,జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Promotion To Aitagoni Anita-అయితగోని అనితకి ప్�

తనపై నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తానని,నల్లగొండ జిల్లాలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.

మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?
Advertisement

Latest Nalgonda News