రానా దగ్గుబాటి,నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలలో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. ఈ చిత్రాన్ని 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రవన్న, సరళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.గత కొద్ది రోజుల వరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇకపోతే చిత్ర బృందం రంగంలోకి దిగి పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ ట్రైలర్ పై ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు.తాజాగా విరాటపర్వం ట్రైలర్ పై రోలెక్స్ స్టార్ సూర్య స్పందిస్తూ ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

విక్రమ్ సినిమాలో చివరి మూడు నిమిషాలు రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య పాత్రకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ఈ క్రమంలోనే గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న రోలెక్స్ స్టార్ట్ తాజాగా విరాటపర్వం ట్రైలర్ పై స్పందిస్తూ.ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమా కోసం తాను ఎంతో ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ వైరల్ అవడమే కాకుండా విరాటపర్వం సినిమాకు సూర్య ట్వీట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.