కాళేశ్వరం ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కలశాలలో పుష్కర ఘాట్ కు చేరుకున్నారు.బోట్ లో అవతలి ఒడ్డుకు చేరుకుని ప్రాణహిత నదిలో పుష్కరుని ఆవాహన కోసం పూజలు నిర్వహించారు.
సుముహూర్తంనా 3:54 నిమిషాలకు పస్కరున్ని ఆవాహనం చేసీ పంచ కళాశాల పూజ, గణపతి పూజ హారతి మంత్ర పుష్పం తో పాటు విశేష పూజలు నిర్వహించారు.ప్రణీత నదికి శారే, చీర, ఓడి బియ్యం, తదితర పూజ సామగ్రిని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమర్పించారు.
ఈ క్రతువుతో పుష్కర మహోత్సవం ప్రారంభం అయింది.అనంతరం ప్రాణహిత అనది నుండి తెచ్చిన జలాలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని అభిషేకించారు.







