టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.
ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.
అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.టాక్ తో పని లేకుండానే బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.అయితే ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా నుండి మరొక వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ సినిమా ఇప్పుడు మరొక 30 దేశాల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని స్వయంగా రామ్ చరణ్ తేజ్ ప్రకటించారు.
ఈయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ ని వరల్డ్ వైడ్ గా 30 కి పైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగు తున్నాయని వెల్లడించారు.
ఈ మూవీ అక్టోబర్ లో జపాన్ లో రిలీజ్ అవుతుందని అప్పుడు నేను, ఎన్టీఆర్ ప్రొమోషన్స్ లో రెండు రోజుల పాటు ఆ దేశాన్ని సందర్శిస్తామని తెలిపారు.

ఇలా ఇప్పుడిప్పుడు మన ఇండియాలో ఆర్ ఆర్ ఆర్ మ్యానియా చల్లారుతూ ఉండగానే చరణ్ చెప్పిన ఈ వార్త ట్రిపుల్ ఆర్ ప్రేక్షకులకు సంతోషం కలిగించింది.మరి రాజమౌళి మరోసారి మాస్టర్ ప్లాన్ వేసినట్టుగానే అనిపిస్తుంది.ఎందుకంటే ఇలా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ మరోసారి పెరగడం ఖాయం.
దీంతో ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ మరికొన్ని రికార్డులను బద్దలు కొడుతోంది.







