సహజంగా మౌనం అన్నది అర్ధాంగికారం అంటారనే ఒక సామెత ఉంది .సమాధానం చెప్పలేని చోట మౌనంగా ఉంటే ఆ తప్పును ఒప్పుకున్నట్లుగా భావించాలంటారు.
మణిపూర్ విషయంలో ప్రధాని మౌనం సమాధానం కాదంటున్నారు బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్( Prakash raj ).బాగ్ లింగం పల్లిలోని “సమూహ సెక్యులర్ రైటర్స్ ఫారం” ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు .ఇప్పుడు వంద రోజులుగా మణిపూర్ మండిపోతుందని ప్రధానితో మాట్లాడించడానికి ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ఆయుదం ప్రయోగిస్తే తప్ప ప్రధాని( Narendra Modi ) మౌనం వీడలేదని మౌనంగా ఉంటే గాయాలు మానవు సరి కదా అవి రాచపుండు గా మారతాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మణి పూర్( Manipur ) గురించి మాట్లాడితే వేరే రాష్ట్రాల గురించి మాట్లాడి డైవర్ట్ చేస్తున్నారని ఒక సమస్యకి మరో సమస్య ఎప్పటికీ సమాధానం కాదంటూ ప్రకాష్ వ్యాఖ్యానించారు.తమకిష్టమైన విషయాలపైనే మాట్లాడతాననే ధోరణి ప్రజాస్వామ్యంలో సరికాదని హేతవు పలికిన ప్రకాష్ రాజ్ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నాయకులు అధికార పరమావధిగా బ్రతకకూడదంటూ చెప్పుకొచ్చారు
ఇప్పుడు దేశం గురించి గొప్పగా చెప్పుకోవడానికి అంటూ ఏమీ మిగల్లేదని అతిపెద్ద ప్రజాస్వామ్యమని మాటల్లో చెప్పుకోవడం కాదని సాటి మనిషికి న్యాయం చేయలేని ప్రజాస్వామ్యం దేనికంటూ ఆయన ప్రశ్నించారు.కేవలం ప్రతిభ ఉన్న వాళ్లు మాత్రమే రచయితలు కాలేరని సమాజం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత ,సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళు మాత్రమే రచయితలుగా రాణిస్తారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.దేశంలో చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయని ప్రజా చైతన్యం వచ్చి నాయకులును నిలదీసినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.స్వలాభం కోసం ఎన్నికలలో ఓట్లు వేయొద్దని సామాజిక దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు
.