కరోనా కారణంగా గత ఆరు నెలల నుంచి షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి.అయితే లాక్ డౌన్ నుంచి పూర్తిగా సడలింపులు ఇవ్వడంతో పాటు షూటింగ్ లకి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
అయితే వీలైనంత తక్కువ క్రూతో షూటింగ్ పూర్తి చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు షూటింగ్ లు చేసుకోవడానికి కొంత మార్గం దొరికింది.
ఇక పెద్ద సినిమాలు అయితే నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని వారు కూడా షూటింగ్ లకి సిద్ధం అవుతున్నారు.దీనికోసం షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ మొదలు పెట్టేశాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ కూడా షూటింగ్ కి సిద్ధం అవుతుంది.
రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ షూటింగుకు ప్లానింగ్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.ఇప్పటికే ఈ చిత్రం షూటింగు కోసం రామోజీ ఫిలిం సిటీలో 6 కోట్ల వ్యయంతో భారీ హాస్పిటల్ సెట్ ను వేయడం జరిగింది.
ఇందులో మెజారిటీ షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తుంది. సెప్టెంబర్ 20 నుంచి తాజా షెడ్యూలును ప్రారంభిస్తారని, మొదట పది రోజుల పాటు ప్రభాస్ లేకుండా ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్లో షూటింగ్ జరగనుంది.
ఆ తర్వాత ప్రభాస్ పాల్గొనే షూటింగును నిర్వహిస్తారని సమాచారం.ప్రభాస్ పై ఈ ఆసుపత్రి సెట్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారని తెలుస్తుంది.అలాగే ఫారిన్ లో షూట్ చేయాల్సిన సన్నివేశాలని కూడా ఇక్కడే పూర్తి చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది.దానికోసం అన్నపూర్ణలో సెట్స్ వేయనున్నారని టాక్