సినీ మరియు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడటం సర్వ సాదారణం అయ్యింది.లక్కీగా ఎక్కువ శాతం మంది కరోనాను జయిస్తున్నారు.
ప్రస్తుతం కరోనాతో పోరాటం సాగిస్తున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా త్వరలో కోలుకుంటారని కుటుంబ సభ్యులు మరియు డాక్టర్లు చెబుతున్నారు.తాజాగా కరోనా బారిన పడ్డ ప్రముఖుల జాబితాలో బొమ్మరిల్లు హాసిని కూడా చేరింది.
ఈమె 21 రోజుల పాటు కరోనాతో పోరాడి తాజాగా దానిపై గెలిచిందట.
ఆ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
నెట్టింట ఆమె షేర్ చేసిన ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.పాజిటివ్ వచ్చిన సమయంలో ఆమె స్పందించలేదు.
చెప్పలేదు.కాని ఇప్పుడు ఆమె ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.
గడచిన 21 రోజులు చాలా భారంగా గడిచాయి దేవుడి దయవల్ల ఇప్పుడు నెగటివ్ వచ్చిందని జెనీలియా పేర్కొంది. ఈ 21 రోజుల పాటు ఆమె పూర్తిగా ఐసోలేషన్ లో ఉన్నట్లుగా పేర్కొంది.
మళ్లీ కుటుంబ సభ్యులను పిల్లలను కలిసినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.ఈ సమయంలో కరోనా పట్ల ఆందోళన అక్కర్లేదు అంటూ కొన్ని టిప్స్ ను చెప్పింది.ప్రస్తుత సమయంలో ఇమ్యూనిటీ పెంచుకోవడంతో పాటు చాలా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించాలంటూ సూచించింది.ఎప్పుడైతే హెల్త్ విషయంలో అనుమానం కలుగుతుందో వెంటనే పరీక్షకు వెళ్లాలి పాజిటివ్ అనిపిస్తే స్వీయ నిర్బందంలోకి వెళ్లాలి అంటూ సూచించింది.