Prabhas Movies Lineup: వచ్చే ఏడాది ప్రభాస్ నుండి రాబోతున్న సినిమాలు ఎన్ని?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు.అందులో కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి కాగా మరికొన్ని సినిమాలు షూటింగ్ సగంలో ఉన్నాయి.

 Prabhas Films Coming For Next Years Salaar Adipurush Project K Details, Prabhas-TeluguStop.com

ఇంకా రెండు మూడు సినిమా లు షూటింగ్ ప్రారంభం కాబోతున్నాయి.ఈ సమయం లో ప్రభాస్ నుండి రాబోతున్న మొదటి సినిమా ఏంటి అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అంతా అనుకున్నట్లుగానే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా మొదటగా విడుదల కాబోతుంది.ఆదిపురుష్‌ తర్వాత రెండు మూడు నెలల గ్యాప్ లోనే మరో సినిమా ను ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

2023 సంవత్సరంలో ప్రభాస్ నటించిన రెండు లేదా మూడు సినిమా లు విడుదల అవుతాయి అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఇప్పటికే ఆయన నటించిన సలార్ సినిమా షూటింగ్ ముగింపు దశ కు చేరుకుంది.

అంతే కాకుండా నాగ్‌ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది అనే వార్తలు వస్తున్నాయి.ఇటీవల మారుతి దర్శకత్వం లో ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

Telugu Adipurush, Maruthi, Prabhas, Prabhas Lineup, Project, Salaar, Sandeep Van

ఇక వచ్చే ఏడాది అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వం లో స్పిరిట్ అనే సినిమా కూడా ప్రారంభం కాబోతుంది.ఇక హిందీ లో సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం లో కూడా ప్రభాస్ ఒక సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయి.ఇన్ని సినిమా లు చేసిన ప్రభాస్ ఏడాదికి రెండు మూడు సినిమా లను కచ్చితంగా విడుదల చేయడం ఖాయం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా పెద్దగా ఉన్నా ఈ ఏడాది సూపర్ హిట్ సినిమా రాకపోవడం అభిమానులను అసహనంకు గురి చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube