పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేస్తున్న అన్ని సినిమాలపై ఆయన ఫ్యాన్స్ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.ప్రభాస్ తాను ప్రకటించిన సినిమాలన్నీ ఒక్కోటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
మరి ఈయన లైనప్ లో ‘ఆదిపురుష్‘ ( Adipurush ) కూడా ఉంది.ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాల కంటే ఈ సినిమా ముందుగా రిలీజ్ కాబోతుంది.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.అందులోను మొదటిసారి ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న ప్రాజెక్ట్ ఇది.టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ( Om Raut ) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా జూన్ లో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే మేకర్స్ కొద్దీ రోజుల నుండి వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక ఆదిపురుష్ నుండి ట్రైలర్ రావాల్సి ఉంది.ఈ ట్రైలర్ గురించి ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.మరి ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
ఇక మరోపక్క ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా పలు సందేహాలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అనుకున్న సమయానికి ఇది తప్పకుండ రిలీజ్ ( Adipurush Release Date ) అవుతుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.ఈ భారీ బడ్జెట్ సినిమాకు అజయ్ – అతుల్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.
సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.