సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా

ఏపీ సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది.ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ రాష్ట్ర హైకోర్టులో సీపీఎస్ఈఏ నేతలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Postponement Of Chalo Vijayawada Program Of Cps Employees-TeluguStop.com

ఛలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి ఒక తేదీని న్యాయస్థానానికి తెలపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.అనంతరం పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలోనే సీపీఎస్ ఉద్యోగుల నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడిందని సమాచారం.వైనాట్ ఓపీఎస్ నినాదంతో ప్రభుత్వంపై సమరానికి ఉద్యోగులు సన్నద్ధమైన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే రేపు లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడను నిర్వహించేందుకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఏర్పాట్లు చేసుకుంది.అయితే కోర్టు అనుమతి రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube