సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా
TeluguStop.com
ఏపీ సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది.
ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ రాష్ట్ర హైకోర్టులో సీపీఎస్ఈఏ నేతలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఛలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి ఒక తేదీని న్యాయస్థానానికి తెలపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
అనంతరం పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది.ఈ నేపథ్యంలోనే సీపీఎస్ ఉద్యోగుల నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడిందని సమాచారం.
వైనాట్ ఓపీఎస్ నినాదంతో ప్రభుత్వంపై సమరానికి ఉద్యోగులు సన్నద్ధమైన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే రేపు లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడను నిర్వహించేందుకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఏర్పాట్లు చేసుకుంది.
అయితే కోర్టు అనుమతి రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిందని సమాచారం.
ఎండ దెబ్బకు తల తిరుగుతుందా.. అయితే వెంటనే ఇలా చేయండి!