ఖమ్మం ఒకప్పటి కమ్యునిస్ట్ ల గుమ్మం.ఇప్పటికీ జిల్లా లో ప్రజా సమస్యలపై ఎర్రజెండా రెపరెపలాడుతూనే ఉంటుంది.
ప్రతీ సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏదోరకంగా కమ్యూనిస్టు నేతలు నిరసలు, ఆందోళనలు చేస్తూనే ఉంటారు.పెట్రోల్ రేటు పెరుగుదల , కరెంట్ బిల్లు పెంపు ఇలా ప్రతీ సమస్య పై తమదైన శైలిలో గళం విప్పుతూనే ఉంటారు.
కానీ ప్రస్తుతం ఒక విషయంలో కమ్యూనిస్టు ల గొంతు మూగబోవడం చర్చనీయాంశంగా మారింది.అధికార పార్టీ మంత్రి దిశానిర్దేశం మేరకు పోలీసుల వేదింపులతో ఖమ్మం పట్టణానికి చెందిన సాయి గణేష్ ఆత్మహత్య ఉదంతంపై కమ్యూనిస్టుల గొంతులు మూగబోయాయి.
అసలు కమ్యూనిస్టు ల మౌనం వ్యూహాత్మకమా ?… రాజకీయమా ? లేక స్థానిక మంత్రి తో లాలూచీ పడ్డారా ? అనే ప్రశ్నలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో ప్రతీ అంశంలో కయ్యానికి కాలుదువ్వే కమ్యూనిస్టు లు సాయి గణేష్ ఆత్మహత్య ఉదంతంపై మిన్నకుండి పోవడం చర్చనీయాంశంగా మారింది.
మిగిలిన ప్రతి పక్ష పార్టీలు సైద్ధాంతిక వైరాన్ని పక్కకు పెట్టి అధికార పార్టీ వేధింపులపై ఒకపక్క నిలదీస్తుంటే … కమ్యునిష్టు నాయకులు మాత్రం మౌన వ్రతం చేపట్టారు.పక్క దేశాలలో యుద్దం పైనా … అక్కడి మానవ హక్కుల పైనా గొంతుచించుకునే కమ్యూనిస్టు నేతలు ప్రస్తుతం తెలుకుట్టిన దొంగల్లా ప్రవర్తిస్తున్నారు.
తెలుగు పాత్రికేయ రంగం లో అరుణ్ సాగర్ ఒక ఉత్తుంగ కెరటం, ఆధునిక వేషదారణ తో తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక వెలుగు వెలిగి ఆదివాసుల గుండె లయలను తన వృత్తి, ప్రవృత్తి అయిన కవిత్వం లో ఒడిసి పట్టిన గుండె మొరాయించి ఒక తెల్లవారు జామున బ్రేకింగ్ వార్తగా మారాడు. సీతా నా పుస్తకానికి సమీక్ష రాయి అని అన్న అరుణ్ కు నివాళి వాక్యాలు రాయాల్సిన దుఖ్ఖమయ స్థితి.
ఎనభయ్యో దశకం తర్వాత అరుణ్ సాగర్ తెలుగు బుద్దిజీవుల్లో ఒక మర్యాదగల పాత్రికేయుడు.చూడడానికి అత్యాదునికునిగా కనిపించే అతను ఆరణాల అచ్చం ఆదివాసీ.అకస్మాత్ గా అయన గుండె పనిచేయడం ఆగింది.
అరుణ్ తండ్రి టి.వి.ఆర్ చంద్రం అంటే గోదావరీ నదీలోయ పరీవాహక ప్రాంతం లో, పోడుకోసం గూడుకోసం, తునికాకు రేటుకోసం జీవితం త్యాగం చేసిన ఒక నికార్సయిన, నిబద్దత కలిగిన సాధారణ కార్యకర్త .ఉమ్మడి కమ్యునిస్ట్ పార్టీ నుండి మార్క్సిస్ట్ పార్టీ దాకా బద్రాచలం ప్రాంత పార్టీహంతక ఎమర్జెన్సీలో ఆ నాటి యువత ప్రత్యామ్నాయ రాజకీయాలను ఒక అనివార్యతగా భావించారు.ఆనాడు దేశవిశ్వవిద్యాలయాలు అగ్గిలా బగ్గున మండాయి.
దాని తర్వాత గ్రామాలకు తరలండి అనే నినాదంలో తమ బవిష్యత్ ను కలగన్న తరం, మండల్ కమీషన్ వెలుగులో నిట్టనిలువుగా చీల్చబడ్డ రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వైరివర్గాలు యుద్ద భూమిగా మారిన విశ్వవిద్యాలయాల ఈదేశ మార్పుకు ఒక కొత్తనీరు చిత్రపటం మీదికి వచ్చిన వైనం మూలంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల లో ఒక కొత్త చైతన్యం పురుడు.
ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల అరాచకాలపై కమ్యూనిస్టు లు సైలెంట్ అవ్వడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది.
మంత్రి జిల్లా లో పేరుగాంచిన కమ్యునిష్టు వ్యాపారవేత్త కొడుకు కావడం చేతనే కమ్యూనిస్టు లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు .రానున్న ఎన్నికలలో అధికార పార్టీతో పొత్తు పెట్టుకునేందుకే కమ్యునిష్టు లు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో సాగుతోంది .రెండు మూడు సీట్లు కమ్యూ నిస్టులకు కేటాయించేందుకు లోపాయి కారీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తో్ంది.ఏది ఏమైనా కమ్యూనిస్టు పార్టీలు సైతం పాతకాలపు సిద్దాంతాలను పాతర పెట్టి … కొత్త తరహా రాజకీయానికి తెరతీస్తున్నాయి.
ఖమ్మం లో సాయి మరణం విషయంలో పక్కపార్టీ నాయకుడని మిన్నకున్నడమే దీనికి నిదర్శనం.