సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నమిత( Namitha ) ఒకరు.బిల్లా, సింహా సినిమాల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నమిత ఇతర భాషల్లో సినిమాల్లో నటించడానికి మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.అయితే నమిత భర్త వీరేంద్ర చౌదరి( Veerendra Chowdary ) బిజినెస్ మేన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.41 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో నమిత భర్తకు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
వీరేంద్ర చౌదరి ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీ ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షునిగా ఉన్నారు.ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న నమిత భర్తను( Namitha Husband ) సైతం విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.విచారణకు హాజరు కావాలని పోలీసుల నుంచి నమిత భర్తకు సమన్లు అందాయి.
ఈ కేసు నుంచి నమిత భర్త బయటపడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.నమిత భర్త పరారీలో ఉన్నాడని పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి విచారణ జరిపే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.2017 సంవత్సరంలో నమిత, వీరేంద్ర చౌదరి వివాహం గ్రాండ్ గా జరిగింది.నమిత విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం బీజేపీలో( BJP ) ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఆమె పని చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ తరపున ఆమె ఎన్నికల్లో ప్రచారం చేశారు.2024 పార్లమెంట్ ఎన్నికల కోసం తమిళనాడులో( Tamil Nadu ) ఆమె ప్రచారం చేస్తున్నారు.ఆమె ప్రచారం బీజేపీకి ప్లస్ అవుతుందో లేదో చూడాలి.
భర్తపై వస్తున్న ఆరోపణల గురించి నమిత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.నమిత నుంచి క్లారిటీ వస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.